హైవే 65పై రోడ్డు ప్రమాదం

  • మాధవరం వద్ద పాదచారులపైకి దూసుకెళ్లిన కారు
  • మహిళ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు 

మునగాల, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద 65వ నంబర్  జాతీయ రహదారిపై పాదాచారుల పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా, మరో నలుగురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు మాధవరం వద్దకు రాగానే అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్​ను ఢీకొట్టి పాదాచారులపైకి దూసుకెళ్లింది.

మాధవరం గ్రామానికి చెందిన రైతులు పొలానికి పురుగు మందు కొట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నేను పిచ్చమ్మ(40) చనిపోయింది. ప్రమాదానికి కారు డ్రైవర్  నిద్ర మత్తే కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.