కోదాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

  • బైక్‌‌‌‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

  • సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఘటన

కోదాడ, వెలుగు : గుర్తు తెలియని వాహనం బైక్‌‌‌‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ములకపట్నం గ్రామానికి చెందిన వల్లపుదాసు వంశీ (22), మాడుగులపల్లి మండలం ఆగామోత్కూరుకు చెందిన అవిరెండ్ల శ్రీకాంత్‌‌‌‌ (21) మలికంటి దినేశ్‌‌‌‌ (21) సెకండ్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ కారు కొనేందుకు బైక్‌‌‌‌పై కోదాడకు వచ్చారు. 

రాత్రి తిరిగి హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ వెళ్తుండగా ఎన్‌‌‌‌ఎస్పీ కాల్వ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న చిలుకూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం డెడ్‌‌‌‌బాడీలను కోదాడ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. దినేశ్‌‌‌‌ తండ్రి 15 రోజుల క్రితమే ప్రమాదంలో చనిపోయాడు.