స్కూల్ పిల్లల ఆటోను,లారీని ఢీకొట్టిన బస్సు..ఆరుగురికి గాయాలు

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ బైపాస్ దగ్గర స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను, లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులతో పాటు బస్సులో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బైపాస్ దగ్గర ఉన్న గోడౌన్లోకి లారీ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో ఆటోను కూడా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్సకోసం ఆస్పతికి తరలించారు. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.