- 20 మందికి గాయాలు
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన యాక్సిడెంట్లో ఒకరూ చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు హైదరాబాద్కు వెళ్తుంది.
కామారెడ్డి మండలం యాసంపల్లి శివారు కు రాగానే హైవే పై ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ టౌన్ కు చెందిన అప్సర్ ఖాన్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దేవుని పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.