వరంగల్​ జిల్లాలో బొలెరో వాహనం బోల్తా

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ సమీపంలోని కొత్తగూడ గాదే వాగు వద్ద   బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా  పడింది.  ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు.  మధ్య ప్రదేశ్​ నుంచి ఖమ్మం జిల్లా జూలూరుపాడుకు మిర్చి పంటను కోసేందుకు వలస కూలీలు వస్తున్నారు.