బొలెరో ఢీకొని..ఇద్దరు మృతి

  • కరీంనగర్ జిల్లాలో ఘటన

రామడుగు, వెలుగు : యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వి.శేఖర్​తెలిపిన ప్రకారం.. రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం అరుణ్ (20), సామంతుల శశిధర్(20) కరీంనగర్ నుంచి బైక్ పై మంగళవారం రాత్రి రామడుగుకు వెళ్తున్నారు. కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో రాంగ్ రూట్​లో స్పీడ్ గా వచ్చి షా నగర్ కోళ్లఫామ్ సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. శశిధర్ స్పాట్ లో .. అరుణ్​ను స్థానికులు కరీంనగర్​ సివిల్​హాస్పిటల్​కు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ 
తెలిపారు.