జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టి వ్యాన్ బోల్తా

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-కరీంనగర్ హైవేపై ఓ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. బుధవారం ( అక్టోబర్ 9, 2024 ) ఉదయం చోటు చేసుకుంది ఈ ప్రమాదం. కామారెడ్డి జిల్లా నుంచి మంచిర్యాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.వ్యాన్ ఫ్రీడం ఆయిల్  ప్యాకెట్ల లోడుతో వెళ్తున్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుకున్నాడు.

డ్రైవర్ ను పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.