అసలేం జరిగింది: ఆర్సీబీలోకి రాకుండా పంత్‎ను అడ్డుకుంది కోహ్లీనేనా..?

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‎లో ఈ ఏడాది మెగా వేలం ఉండటంతో లీగ్‎లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తు్న్నాయి. స్టార్ ప్లేయర్లు చాలా మంది టీమ్స్ మారే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగానే టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ సైతం జట్టు మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‎లో ప్రస్తుతం రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు. అయితే, సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒక్కసారి ఢిల్లీ టైటిల్ గెలవలేదు. రిషబ్ కెప్టెన్సీలోనూ ఢిల్లీకి ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. దీంతో పంత్‎పై ఢిల్లీ యాజమాన్యం అసంతృప్తిగా ఉందని.. పంత్ ను కెప్టెన్సీ నుండి పక్క తప్పించాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో పంత్ కూడా ఢిల్లీని వీడేందుకు సిద్ధమయ్యాడని.. ఆర్సీబీ జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డూప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కూడా సాలిడ్ కెప్టెన్ కోసం చూస్తోందని.. ఇందులో భాగంగానే పంత్ ఆర్సీబీతో మంతనాలు చేశాడని.. అయితే పంత్ రాకను టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అడ్డుకున్నాడని క్రీడా వర్గాల్లో వార్తలు కోడైకూస్తు్న్నాయి. విరాట్ రాజకీయాల కారణంగా ఆర్సీబీలోకి రిషబ్ పంత్ ఎంట్రీకి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో సంప్రదింపులు చేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంపై రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యాడు. ఆర్సీబీతో చర్చలు జరిపినట్లు జరుగుతోన్న వార్తలన్నీ ఫేక్ అని పంత్ కొట్టిపారేశాడు.

ALSO READ : కోహ్లీకి ఏమైంది..?: 15 బంతుల్లోనే నాలుగు సార్లు ఔట్

ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ఎందుకు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. మరోసారి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించొద్దని.. నిజాలు తెలుసుకునే రాయాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. పంత్ స్పందించడంతో ఆర్సీబీలోకి వెళ్తున్నట్లు జరగుతోన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. కాగా, రోడ్డు ప్రమాదం నుండి కోలుకుని చాలాకాలం తర్వాత టెస్ట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. కీలక సమయంలో సెంచరీతో రాణించి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి ప్రపంచానికి నిరూపించాడు పంత్.