Rishab Shetty: మరో ప్రయోగాత్మక మూవీ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి

హీరో కం డైరెక్టర్ రిషబ్‌‌‌‌ శెట్టి(Rishab Shetty) కాంతారా ప్రీక్వెల్ తెరక్కిస్తునే మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీలో హనుమంతుని పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి అంచనాలు పెంచేశాడు.

ఇవాళ డిసెంబర్ 3న ఛత్రపతి శివాజీ పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చారిత్రక ఇతిహాసంతో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు హీరో రిషబ్ శెట్టి. సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న రిలీజ్ కానుందని ప్రకటించారు. 

ఈ సందర్బంగా హీరో రిషబ్ శెట్టి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. "ఇది కేవలం సినిమా కాదు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన, శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం యొక్క శక్తిని సవాలు చేసిన ఛత్రపతి శివాజీ యోధుని కథ. ఎప్పటికీ మరచిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధుని గౌరవించటానికి ఇది ఒక యుద్ధ నినాదం. ఈ యాక్షన్‌ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్‌ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి" అంటూ రిషబ్ పోస్తులో వెల్లడించారు.