ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీలు పెంచాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్​ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. హాస్పిటళ్లలో డెలివరీల పెంపుపై కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మే నుంచి అక్టోబర్ వరకు 3,206 డెలివరీలు జరిగాయన్నారు.

ఇందులో  ప్రభుత్వ హాస్పిటళ్లలో1860, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,308 డెలివరీలు జరిగాయన్నారు.  అలాగే వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వసంతరావు రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రజిత, ఎంహెచ్ఎన్ అంజలి, ఆల్ఫ్రెడ్ ఎన్ సీడీ స్టేట్ కన్సల్టెంట్ సత్యేంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.