పోచమ్మకుంట ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత 

కరీంనగర్​ రూరల్​, వెలుగు: రూరల్​ మండలంలోని నగునూర్​ లో పోచమ్మకుంటలో ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. సర్వేనెంబర్ 471 భూమిలో కంపౌండ్​ వాల్​ నిర్మించగా రెవెన్యూ అధికారులు దాన్ని కూల్చేసేందుకు వెళ్లారు. దీంతో గోడ నిర్మించిన వారు స్పందిస్తూ.. గత 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నామని కూల్చివేతను అడ్డుకున్నారు.

దీంతో అధికారులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నామని ఇంటి స్థలాలకు పర్మిషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కంపౌండ్​ వాల్​ నిర్మాణం చేపడుతుండగా తమ సిబ్బందితో కూల్చివేసేందుకు వెళ్లామన్నారు.