ఫేక్​ క్యాస్ట్​ సర్టిఫికేట్​తో జాబ్​ .. రిటైర్డ్​ ​ఉద్యోగిపై కేసు నమోదు

నిజామాబాద్, వెలుగు: తప్పుడు కులం సర్టిఫికెట్​తో ఆర్టీసీలో జాబ్​ పొంది, రిటైర్డయిన​ఉద్యోగిపై వన్​టౌన్ ​ఎస్​హెచ్​వో విజయ్​బాబు గురువారం కేసు నమోదు చేశారు. 1986లో ఎస్సీ రిజర్వేషన్​ క్లెయిమ్ ​చేసి, 32 ఏండ్లుగా కండక్టర్​గా పనిచేసి రిటైర్డయిన నిజామాబాద్​బోర్గాం(పి)కి చెందిన ఎం.చంద్రశేఖర్​పై డిపో మేనేజర్​ సంపూర్ణానంద్ ​పోలీసులకు కంప్లైంట్ ​చేశారు.

1983లో అప్పటి బోధన్​తహసీల్దార్ ​జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్​పై కొందరు ఫిర్యాదు చేయగా, విచారణ చేసిన కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు దాన్ని రద్దు చేశారన్నారు. రిజర్వేషన్ ​ఆధారంగానే సెలక్షన్​కమిటీ చంద్రశేఖర్​కు ఆర్టీసీలో జాబ్​ఇచ్చిందన్నారు. సంస్థను మోసగించినందున చంద్రశేఖర్​పై చర్యలు తీసుకోవాలని డీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.