సహకార సమాఖ్యతత్వానికి అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ

దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేందుకు బలమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. 

చైర్మన్​: ప్రధాన మంత్రి

సభ్యులు: అన్ని రాష్ట్రాల, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు. 

తొమ్మిది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. 

శాశ్వత ఆహ్వానితులు: 13 మంది కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు. 

కొత్త స్టాండింగ్​ కమిటీలో చైర్మన్​గా కేంద్ర హోంమంత్రి అమిత్​షా నియమితులయ్యారు. సీనియర్​ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష, అధికార పార్టీ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. 

 గతంలో ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ అంతర్రాష్ట్ర మండలి సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు గవర్నర్ కాకుండా ఆ రాష్ట్ర చీఫ్​ సెక్రటరీ హాజరుకావాల్సి ఉంటుంది. 

ప్రాతినిధ్యం పెంపు: పునరుద్ధరించిన అంతర్రాష్ట్ర మండలిలో జనతాదళ్​ (యునైటెడ్), జనతాదళ్​ (సెక్యులర్​), తెలుగుదేశం పార్టీ తదితర ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కేంద్ర మంత్రులు ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్య 5 నుంచి 13కు పెంచారు. 

గతంలో అంతర్రాష్ట్ర మండలి కూర్పు

చైర్మన్​గా ప్రధాన మంత్రి, సభ్యులుగా అన్ని రాష్ట్రాలు, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర హోంమంత్రితో సహా ప్రధాన నామినేట్​ చేసే ఆరుగురు కేబినెట్​ మంత్రులు, ప్రధాని నామినేట్​ చేసే ఐదుగురు శాశ్వత ఆహ్వానితులు (కేంద్ర మంత్రులు) ఉండేవారు. గత స్టాండింగ్​ కమిటీలో ఐదుగురు కేంద్ర కేబినెట్​ మంత్రులు, తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉండేవారు. 

అంతర్రాష్ట్ర మండలి 

ఆర్టికల్​ 263: కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్​ 263 పేర్కొంటోంది. ఆర్​ఎస్ సర్కారియా కమిషన్ 1998, జనవరిలో ఇచ్చిన నివేదిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఇంటర్​ గవర్నమెంటల్​ కౌన్సిళ్లు, ఆర్టికల్​ 263 కింద ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దీని ఆధారంగా 1990, మే 28న వి.పి.సింగ్​ నేషనల్​ ఫ్రంట్​ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది.