చిన్న కాళేశ్వరం పనులను అడ్డుకున్న నిర్వాసితులు

  • పరిహారం ఇవ్వకుండా కెనాల్‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభించడంపై ఆగ్రహం
  • ఆఫీసర్లు, పోలీసులతో వాగ్వివాదం, పలువురి అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎల్కేశ్వరం వద్ద ఉద్రిక్తత

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  చిన్న కాళేశ్వరం పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా కెనాల్‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, పోలీసులతో వాగ్వాదానికి దిగగా, పోలీసులు పలువురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. దీంతో భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్  పీరియడ్‌‌‌‌‌‌‌‌లో మొదలైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులు ఆ తర్వాత బీఆర్ఎస్  గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్​ సర్కారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరిందించాలని భావిస్తోంది.

రూ.200 కోట్లను విడుదల చేయగా, కొన్ని నెలలుగా ‌‌‌‌పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మందర చెరువు నుంచి ఎన్కపల్లి వరకు నిర్మిస్తున్న మెయిన్  కెనాల్  పనులను మంగళవారం ఎల్కేశ్వరం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీ, ఇతర యంత్రాలను అడ్డుకుని నిరసన తెలిపారు. వారం రోజులుగా కెనాల్  పనులను రైతులు అడ్డుకుంటున్నారు. గతంలో రెవెన్యూ ఆఫీసర్లే తమ భూములుకు పాస్​బుక్​లు జారీ చేయగా

ఇది ప్రభుత్వ భూమేనంటూ ఇప్పటి ఆఫీసర్లు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై మహాదేవపూర్  తహసీల్దార్​ ప్రహ్లాద్  మాట్లాడుతూ 14 ఏండ్ల కింద సాగులో ఉన్న భూమికి పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ భూములను గతంలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు పనులను అడ్డుకుంటున్న వారి పేర్లను రికార్డుల్లో నమోదు చేయడం, ధరణిలో పలువురికి పట్టా బుక్కులు ఇవ్వడంతో నష్ట పరిహారం సమస్య వచ్చిందని చెప్పారు.