వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇండ్లు మునిగిపోవడం, గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరడం, రోడ్లు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం, నదులు ఉధృతంగా ప్రవహించడంతో మనుషులు, పశువులు కొట్టుకుపోవడం జరుగుతుంటాయి.. అలాంటి సమయాల్లో చాలా మంది నీట మునిగి, వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయి చనిపోతుంటారు. మాన్యువల్ రెస్క్యూ టీంలుగానీ,అధికారులుగానీ, స్థానికులు గానీ సాహసం చేసి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడితే తప్పా వారు బతికిబయటపడటం కష్టం.. అయితే వర్షాకాలంలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొత్త డ్రోన్ వచ్చింది.. అదే రెస్క్యూ డ్రోన్.. దీని పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ రెస్క్యూడ్రోన్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని ఎలా రక్షిస్తుందో తెలుసుకుందాం..
This is done to rescue the people trapped in the flood and to get them out safely....???????? pic.twitter.com/eUiqEEZ7tO
— Ashutosh Wagh (@AshutoshPWagh) July 25, 2024
వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని.. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు తయారు చేసిన రెస్క్యూ డ్రోన్ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆపరేటర్ ఒడ్డున నిలబడి డ్రోన్ ను నీటిలోకి వదిలితే అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. జెట్ వేగంలో వరద నీటిలోకి వెళ్లిన ఈ రెస్క్యూ డ్రోన్.. అంతే వేగంతా మనిషిని సురక్షితంగా వడ్డుకు చేర్చింది.
ALSO READ | Zomato Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్ రూం టూర్ వీడియో వైరల్.. ఆ రూం ఎలా ఉందో చూడండి..
ఎవరు తయారు చేశారు..ఎక్కడ ఉంది అనే విషయాలు సరిగా తెలియవు కానీ.. ఈ రెస్క్యూ డ్రోన్ కు సంబంధించిన వీడియోను ఆశుతోస్ వాగ్ అనే అతను సోషల్ మీడియా Xలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. గ్రేట్ ఇన్షియేటివ్.. గ్రేట్ ఇన్నోవేటివ్ అని మెచ్చుకుంటున్నారు. నిజానికి ఇలాంటి ఆవిష్కరణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.. ప్రజలకు ఉపయోగిపడే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.