IND vs AUS 3rd Test: టీమిండియాకు పండగ లాంటి వార్త.. నాలుగో టెస్టుకు హెడ్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ ఆటగాడు చేరాడు. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ కు గాయమైంది. మూడో టెస్ట్ తర్వాత అతను గజ్జల్లో గాయం అయినట్టు తెలుస్తుంది. దీంతో హెడ్ నాలుగో టెస్ట్ ఆడడం అనుమానంగా మారింది. గాయం తీవ్రత ఎక్కువైతే సిరీస్ మొత్తానికి ఈ ఆసీస్ బ్యాటర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. 

హెడ్ గాయంపై త్వరలోనే ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఓ వైపు ఈ వార్త ఆస్ట్రేలియాను ఆందోళనకు గురి చేస్తుంటే.. మరోవైపు టీమిండియాన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. భారత్ పై ఫార్మాట్ ఏదైనా హెడ్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లోనూ అతని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్ లతో బ్యాటింగ్ లో ఆసీస్ ను నిలబెడుతున్నాడు. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో సెంచరీలు చేశాడు.

Also Read:-ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్..

ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్ లు ఆడిన హెడ్.. రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సిరీస్ లో 3 టెస్టుల్లో 409 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో హెడ్ మినహాయిస్తే మిగిలిన ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. తాజాగా ముగిసిన గబ్బా టెస్టులో 140 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు హెడ్ దూరమైతే అతని స్థానంలో జోష్ ఇంగ్లిస్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు.