ఎడపల్లిలో రేణుకాఎల్లమ్మ కల్యాణోత్సవం ప్రారంభం

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో  కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాలు ప్రారంభించారు.  

శుక్రవారం నుంచి ఈ నెల 30 తేదీ వరకు 5 రోజుల  పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా గౌడ కులస్తులు గడపావన పూజ, ఇళ్లలో జోగేత్తే కార్యక్రమాలను నిర్వహించారు.  వాడవాడలా  మేళతాళాలతో ఆటపాటలతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.