ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కాటమయ్య బోనం సమర్పణ, గంగబోనం సమర్పణ, చెరువులో తెప్ర తీయడం, పుట్టదరి పోయడం, ఏడంత్రాల బోనం సమర్పణ, ఎరుకల బుట్టి సమర్పణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.  సోమవారం తెల్లవారుజామున ఎల్లమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాలు సమర్పిచారు.  నిజామాబాద్​ జిల్లా పరిషత్​ చైర్మన్​ దాదన్న గారి విఠల్​ రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.