Jio AirFiber 5G కోసం కొత్త డేటా బూస్టర్ ప్లాన్ 

Jio AirFiber: రిలయన్స్ జియో తన 5G  ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్ (FWA) సర్వీస్ Jio AirFiber కోసం కొత్త డేటా బూస్టర్ ప్లాన్లను విడుదల చేసింది.ఈ ప్లాన్లు  దేశంలోని దాదాపు 7వేల పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ప్లాన్లు .. బూస్టర్ ప్లాన్లు.. ఇవి యూసేజ్ పాలసీ 1TB డేటా లిమిటెడ్ అయిపోయిన సబ్ స్క్రైబర్లకోసం తీసుకువస్తోంది. ఈ ప్లాన్ల  గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

జియో ఎయిర్ ఫైబర్ డేటా బూస్టర్ ప్లాన్లు 

రిలయన్స్ జియో AirFiber  సర్వీస్ రూ. 101 ప్రారంభ ధరతో మూడు కొత్త డేటా వోచర్లను అందిస్తోంది. మిగతా రెండు డేటా వోచర్లు రూ.251 , రూ.401లతో అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ప్లాన్ల డేటా స్పీడ్ తగ్గకుండా కస్టమర్ కు ఈ ప్లాన్ లుఅదనపు డేటాను అందిస్తాయి. 

రూ. 1201 వోచర్ లో 100GB డేటా ఉంటుంది. ఇది యాక్టివ్ ప్లాన్ వ్యవధి వరకు చెల్లుబాటు అవుతుంది. రూ. 251 వోచర్ 500GB డేటాను అందిస్తుంది. ఇది కూడా కస్టమ ర్ అసలు ప్లాన్ చెల్లుబాటు సమయం వరకు పనిచేస్తుంది.  రూ. 401 వోచర్ 1TB డేటాను అందిస్తుంది. కస్టమర్ ఒరిజినల్ ప్లాన్  చెల్లుబాటు అయ్యే వ్యవధిలోనే పని చేస్తుంది. 

ఇటీవల కాలంలో దేశంల 5G నెట్ వర్క్, సర్వీస్ వేగంగా విస్తరించాయి. ఎక్కువమంది కస్టమర్లు హైస్పీడ్ ఇంటర్నెట్కోసం 5Gవైపు మొగ్గు చూపడమే ఇందుకు కార ణం. Jio, Airtel రెండూ కూడా చాలా నగరాల్లో 5G సర్వీస్ లను అందుబాటులో తెచ్చాయి. ఇంకా ఈ నెట్ వర్క్ సర్వీసులు ఇంకా 5G ప్లాన్లను ప్రారంభించనప్పటికీ ప్రస్తుత వినియోగదారులకు ఉచిత 5G డేటాను అందిస్తున్నారు.