జియో షాకులపై షాకులు: OTT ప్లాన్స్ కూడా మార్చేసింది..కట్ చేసింది..

రిలయన్స్ జియో నెట్ వర్క్ కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచింది. దాదాపు 25 శాతం వరకు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల ధరలు అమాంతం పెంచింది. రిలయన్స్ జియో..కస్టమర్లపై భారం మోపింది. ఇది చాలదన్నట్లు జియో అందిస్తున్న ఇంతకుముందున్న బెనిఫిట్స్ కూడా కట్ చేస్తోంది. తాజాగా జియో అందిస్తున్న కొన్ని రకాల ఎంటర్ టైన్ మెంట ప్లాన్లను తొలగించింది. జియో నెట్ వర్క్ ఇస్తున్న వరుస షాకులతో కస్టమర్లు లబోదిబో మంటున్నారు. 

Jio SonyLiv, Zee5లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక ప్లాన్ మాత్రమే అందిస్తుంది అది కూడా డేటా ప్లాన్. ఈ ప్లాన్ ధర రూ.175. ఇది 28 రోజుల పాటు 10GB డేటాను అందిస్తుంది. 

జియో తొలగించిన ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్లు 

  • జియో రూ. 3,662 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటాతో 365 రోజుల చెల్లుబాటును అందించింది. Sony LIV , ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్ 
  • Jio రూ. 3,226 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాతో 365 రోజుల చెల్లుబాటును అందించింది , Sony LIV సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్ 
  • జియో రూ. 3,225 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాతో 365 రోజుల చెల్లుబాటు, ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ అందించే  ప్లాన్ 
  • జియో రూ. 2,999 ప్లాన్: రోజుకు 2.5GB డేటాతో 365 రోజుల చెల్లుబాటు, 
  • జియో రూ. 909 ప్లాన్: రోజుకు 2GB డేటాతో 84 రోజుల చెల్లుబాటు, Sony LIV , ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్ 
  • Jio రూ 806 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాతో 84 రోజుల చెల్లుబాటును అందించింది , Sony LIV సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్
  • Jio రూ 805 ప్లాన్: రోజుకు 2GB డేటాతో 84 రోజుల చెల్లుబాటు, ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్
  • జియో రూ. 3178 ప్లాన్: రోజుకు 2GB డేటాతో 365 రోజుల చెల్లుబాటు, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ అందించే ప్లాన్
  • జియో రూ. 4498 ప్లాన్: రోజుకు 2GB డేటా, JioTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ . 78GB బోనస్ డేటాతో 365 రోజుల చెల్లుబాటు అందించే ప్లాన్
  • Jio రూ 3227 ప్లాన్: అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 2GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అందించే ప్లాన్
  • వీటితో పాటు JioTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించే రూ. 398, రూ. 1198 వంటి ప్రముఖ ప్లాన్లను Jio తొలగించింది.
  • ఇంకా Jio రూ. 331 ప్లాన్‌ను కూడా నిలిపివేసింది.ఇది 30 రోజుల చెల్లుబాటుతో 40GB డేటాను , డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది.