Jio: మీది జియోనా..? రీఛార్జ్ డేట్ దగ్గర పడిందా..? ఇంట్లో పెళ్లి తర్వాత అంబానీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..!

భారత్లో రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్ ధరలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మధ్య ప్లాన్ల ధరలు పెంచాక కొన్ని రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి రిలయన్స్ జియో కొన్ని మార్పులుచేర్పులు చేసింది. తాజాగా.. రిలయన్స్ జియో మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ.349 ప్లాన్లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు జియో యూజర్లకు కొంత ఊరట కలిగించే విధంగా ఉండటం గమనార్హం. 349 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీని జియో అప్డేట్ చేసింది. ఇన్నాళ్లూ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉండేది. ఇక నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ బెన్ఫిట్స్ను ఎంజాయ్ చేయొచ్చని జియో ప్రకటించింది. రెండు రోజుల వ్యాలిడిటీ పెరిగిందంటే 4జీజీ హై స్పీడ్ డేటా కూడా ఈ ప్లాన్లో భాగంగా యూజర్లు పొందుతారు.

రిలయన్స్ జియో 349 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ హై స్పీడ్ 4జీ డేటాను 30 రోజుల వరకూ ఆస్వాదించొచ్చు. అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఈ ప్లాన్లో భాగంగా యూజర్లు ఎంజాయ్ చేయొచ్చు. టారిఫ్ ధరలు పెరగక ముందు ఈ రూ.349 రీఛార్జ్ ప్లాన్ ధర రూ.299 ఉండేది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా ప్రొవైడ్ చేసే రూ.209 ప్లాన్ ధర రూ.249కి, 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా ప్రొవైడ్ చేసే రూ.666 ప్లాన్ ధర రూ.799కి, రోజుకు 2.5జీబీ ప్రొవైడ్ చేసే వార్షిక రీఛార్జ్ ప్లాన్ అయిన రూ.2,999 ధర రూ.3,599కి జియో పెంచిన సంగతి తెలిసిందే. రూ.349 ప్లాన్ పేరును జియో హీరో 5జీగా మార్చింది.