ఐదేండ్ల అభివృద్ధి లక్ష్యాలపై కరపత్రాలు విడుదల : ధర్మపురి అర్వింద్

తాను గెలిస్తే యూత్ కు ఉపాధి కల్పిస్తా

బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 

నిజామాబాద్​, వెలుగు: గత ఎలక్షన్​లో బాండ్​పేపర్​ రాసిచ్చి పసుపు బోర్డు సాధించానని రెండోసారి గెలిచాక యూత్​కు ఉపాధి అవకాశాలపై ప్రధాన ఫోకస్​ చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల పాటు తాను నిర్ణయించుకున్న లక్ష్యాలపై విజన్​ డాక్యుమెంట్​ పేరుతో ఆయన కరపత్రం విడుదల చేశారు.  వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీస్​ జిల్లాకు తెస్తానని, పసుపు, వరి, మొక్కజొన్న, మామిడి అనుబంధ పరిశ్రమలు తేవడంతో పాటు మంచి రేట్​ లభించేలా చూస్తానన్నారు.  జక్రాన్​పల్లి ఎయిర్​పోర్టు, నిజాం చక్కెర ఫ్యాక్టరీలు రీఓపెన్​, బీడీ కార్మికుల కోసం 500 పడకల సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​, ఆర్మూర్​– ఆదిలాబాద్​ రైల్వేలైన్​, ముద్కెడ్​–డోన్​ వయా నిజామాబాద్​డబ్లింగ్​ లైన్​, బోధన్​–బీదర్​ కొత్త లైన్​ వేయిస్తానన్నారు. 25 వేల మంది యూత్​కు జాబ్స్​ దొరికేలా పెట్టుబడులు తెస్తానని అర్హులైన కుటుంబాలకు రేషన్​ కార్డులు స్టేట్​గవర్నమెంట్​తో కొట్లాడి ఇప్పిస్తానన్నారు.  ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్​రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్​ దినేష్​కులాచారి తదితరులు ఉన్నారు.