హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ధర్నా

  • పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు

ఎల్లారెడ్డిపేట, వెలుగు :  ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకోమన్నందుకు తమ కూతురిని ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం ఎల్లారెడ్డిపేట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువు తండా గ్రామానికి చెందిన బానోతు మమత (21) గురువారం తన ఇంట్లో చనిపోయిన విషయం తెలిసిందే.

మమత గోల్యానాయక్ తండాకు చెందిన గుగులోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకుందామని కోరడంతో మమత తల్లిదండ్రులు సతీశ్ ఇంటికి వెళ్లి అడగగా అతడి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా మమతను వదిలించుకోవాలని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాము ఇంట్లో లేని టైంలో ఆమెను చంపి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

నిందితులను పట్టుకొని తమకు అప్పగించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ సుమారు 200 మంది ఎల్లారెడ్డిపేట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.