దిమ్మతిరిగే ఫిచర్స్‌తో రెడ్మీ నోట్ 13 ప్రో: బ్యాక్ క్యామ్ 200 MP

ఇండియా మొబైల్ మార్కెట్‌లో షావోమీ కంపెనీ ఓ కొత్త  మోడల్ ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మీ నోట్ 13 ప్రో స్కార్లెట్ రెడ్ ఎడిషన్ మార్కెట్ లోకి విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ పరంగా ఈ ఫోన్ యూజర్స్ మనసు దోచుకుంటోంది. అమెజాన్,  రెడ్మీ అఫీషియల్ వెబ్ సైట్లో ఈ  ఫోన్ కొనుకోలు చేయవచ్చు. దీని స్పెషాలిటీ వెనుక కెమెరా 200 మెగా పిక్సల్ తో వస్తోంది. ఈ ఫీచర్ రెడ్ మీ నోట్ 13 ప్రోని హైలెట్ చేస్తోంది. అంతేకాదు 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (రోమ్) ఈ మొబైల్ తో లభిస్తుంది.  సేమ్ ఫీచర్స్ తో128 జీబీ వేరియంట్ కూడా తీసుకువచ్చింది. వీటి ధర 128 జీబీ రోమ్ రూ.24వేల 999 గా, 256 జీబీ రోమ్ రూ26వేల 999 లుగా నిర్ణయించారు.

రెడ్మీ నోట్13 ప్రో  ఫీచర్స్:

  •  6.67 ఓ ఎల్ఈడీ డిస్ల్పే 1.5 రిజల్యూషన్  
  •  Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌
  •  67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 5,100mAh బ్యాటరీ
  •  200MP బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో-షూటర్‌తో వస్తుంది. ఫ్రెంట్ 16 MP కెమెరా
  •  8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 128 జీబీ కూడా ఉంది)