మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  •     ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన 

సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 21న సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని మర్కల్​ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన అశోక్​ ఫంక్షన్ ​హాల్‌లో ​, రెడ్​క్రాస్​సొసైటీ సహకారంతో ట్రాఫిక్​ రూల్స్ పై అవగాహన  రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సదాశివనగర్ ఎస్‌హెచ్‌వో  కాజల్ ​(ఐపీఎస్​) అధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు.  ముఖ్య అథితిగా కలెక్టర్​ జితేశ్. వి పాటిల్​, ఎస్పీ సింధూ శర్మలు వస్తున్నట్లు పేర్కొన్నారు.  

జాతీయ రహదారి పై ఉన్న దాబా హోటళ్లు, మెకానిక్, టైర్ పంక్చర్ షాపులు, ఆటో, లారీ, ట్రాక్టర్ అసోసియేషన్ల వారు రావాలన్నారు.  ట్రాఫిక్​ రూల్స్​ పై అవగాహన అనంతరం రక్తదాన శిబిరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్ గౌడ్, ఎస్ ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.