రెండోరోజూ ముంచెత్తిన వర్షం గుజరాత్​లో16 మంది మృతి

  • బాధితులను ఆదుకోవాలనిరాహుల్ గాంధీ, ఖర్గే విజ్ఞప్తి

వడోదర: గుజరాత్​ను బుధవారం రెండో రోజు కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో మరణించిన వారి సంఖ్య16కు చేరుకుంది. వడోదర సిటీలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో అజ్వా డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో వడోదర సిటీలో ప్రవహించే విశ్వామిత్రి నది 25 అడుగుల ప్రమాదకర స్థాయిని దాటింది.

నదికి ఇరువైపులా ఉన్న అనేక ప్రాంతాలు10 నుంచి 12 అడుగుల మేర నీట మునిగాయి. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 38 వేలకు పైగా ఆహార పొట్లాలను పంపిణీ చేశాయి.

విపత్తు ప్రభావాన్ని తగ్గించాలి: రాహుల్​

భారీ వర్షాలకు ఆత్మీయులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సానుభూతి తెలిపా రు. సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ట్వీట్​ చేశారు.