టెక్నాలజీ : స్మార్ట్​ ఫోన్​కి అడిక్ట్​ కాకుండా..

ఫోన్​ అడిక్షన్​ అవడానికి కారణం సోషల్​ మీడియా. సోషల్ మీడియాలో అప్​డేట్స్​ కోసం ఫోన్ చూస్తుంటారు. ఆ అప్​డేట్స్​ను కొన్ని గంటల తర్వాత చూసినా పోయేదేం లేదనే విషయం అర్థం చేసుకుంటే ఆటోమెటిక్​గా ఫోన్​ వాడకం తగ్గిపోతుంది. అంటే సోషల్ మీడియా వాడకాన్ని నెమ్మదిగా తగ్గించాలి.  

  • ఫోన్​లో నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి మొబైల్​ చూసే అలవాటు ఉంటుంది ఎక్కువమందికి. దాంతో ఫోన్ వాడకం ఎక్కువైపోతుంది. కాబట్టి ఫోన్​లోని యాప్స్​కు నోటిఫికేషన్​ ఆఫ్ చేయాలి. 
  • రోజూ ఫోన్​ను ఎంతసేపు వాడుతున్నారో? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెల్​ఫోన్ వాడే టైంను మెల్లగా తగ్గించాలి.  
  • ఫోన్​లో అలారం పెట్టుకోకుండా వేరే డివైజ్​లో పెట్టుకోవాలి. 
  • ఫేస్ బుక్, వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఇ–మెయిల్ మెసేజ్​లకు రిప్లై ఇవ్వడానికి రోజులో ఏదో ఒక టైం పెట్టుకోవాలి. 
  •  వీలుంటే ప్రతి రోజు కొన్ని గంటలపాటు ఫోన్​ని పక్కన పెట్టాలి. ఫోన్​ వాడకం తగ్గించేందుకు మరో టెక్నిక్​ ఇంటర్నెట్​ ఆపేయడం.
  •  ఫోన్ ఛార్జింగ్​ దూరంగా పెట్టుకోవాలి. అలాకాకుండా కూర్చున్న లేదా పడుకున్న దగ్గర ఫోన్​ ఛార్జింగ్ పెడితే మాటిమాటికీ తీస్తుంటారు. 
  •   ఫోన్ వాడకుండా ఎంత టైం ఉండగలను’’ అని డిసైడ్ చేసుకుని. అంతసేపు ఫోన్​ వాడకుండా ఉండాలి.