Realme 14x 5G: రూ.15వేలకే కొత్త స్మార్ట్ ఫోన్..డిసెంబర్18న లాంచింగ్..బెస్ట్ బ్యాటరీ

మీ బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అడ్వాన్వ్డ్ టెక్నాలజీ, బెస్ ఫీచర్లతో సెల్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్ డివైజ్ కావాలా...అయితే ఈ కొత్త స్మార్ట్ఫోన్ మీకు సరియైనది. ఈ ఫీచర్లు ఉన్న కొత్త స్మార్ట్ఫోన్ మరో మూడు రోజుల్లో లాంచ్ అవుతుంది..దాని ఫీచర్లు, పనితీరును తెలుసుకుందాం.

ప్రముఖ సెల్ఫోన్ తయారీ సంస్థ Realme తన కొత్త స్మార్ట్ఫోన్ Realme 14x ను డిసెంబర్18న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గల బ్యాటరీ ఉంటుంది.. ఇది IP69 రేటింగ్తో 6000 mAh సామర్థ్యం గల ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీని ఉంటుంది. 

Realme  డిజైన్ అదుర్స్.. 

Realme 14x 5G సోషల్ మీడియాలో స్మార్ట్ఫోన్ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ఇది దాని ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్, అద్భుతమైన డైమండ్-కట్ గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్‌తో రియల్ మీ కస్టమర్ల మనసు దోచుకుంటోంది. ఈ డివైజ్లో మరో ముఖ్యమైన ఫీచర్.. రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్. కలర్ విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది. 

స్టోరేజీ ఆప్షన్లు.. 

రియల్మీ 14x 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు రకాల RAM వేరియంట్‌లలో లాంచ్ చేయబడుతుంది. ఇందులో 8GB RAM ,256GB స్టోరేజ్‌తో కూడిన టాప్-టైర్ మోడల్ ఉంటుంది. ఇది మీ అన్ని అవసరాలకు మృదువైన మల్టీటాస్కింగ్ఉపయోగపడుతుంది. 

ALSO READ | Gemini 2.0: గూగుల్ జెమిని 2.0 వచ్చేసింది.. గత వెర్షన్ కంటే రెండు రెట్ల వేగంతో..

డిస్ ప్లే, మన్నిక..

ఈ స్మార్ట్ఫోన్..6.67 అంగుళాల HD+IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్కు మంచి ఎంపిక. ఈ స్మార్ట్ఫోన్ IP69రేటింగ్తో వాటర్ప్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్లకు ఇది బెస్ట్వన్. ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొంటుంది. 

బ్యాటరీ,ఫీచర్లు

6000 mAh బ్యాటరీతో రాబోయే స్మార్ట్‌ఫోన్ మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగించబడుతున్నప్పుడు ఎక్కువసేపు ఉంటుంది. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా రెట్టింపు అవుతుంది.

ధర, ఎక్కడ లభిస్తాయంటే.. 

రియల్మీ14x 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.15వేలలోపే ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన IP69 రేటెడ్ స్మార్ట్ ఫోన్గా చెప్పవచ్చు. ఇది Realme అధికారిక వెబ్‌సైట్, Flipkart ద్వారా కొనుగోలు చేయొచ్చు.