Realme 13సిరీస్లో ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లు లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివిగో

రియల్ మీ ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ.. Realme 13సిరీస్లో కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. Realme Pro +, Realme Pro రెండు స్మార్ట్ ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లతో ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 7s Gen2 Soc ప్రాసెసర్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే తో మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందింస్తుంది. Realme Pro+ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP  మెగాపిక్సెల్ సోని ప్రైమరీ రియర్ కెమెరా, తో ఫొటోగ్రఫీలో మంచి పనితీరును అందిస్తుంది. అయితే Realme Pro డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. Realme Pro +, Realme Pro  స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

మంగళవారం జూలై 30,2024 సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు Realme 13 సిరీస్ ప్రారంభ సేల్ ను ప్రారంభిస్తుంది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు  Flipkart, Realmi  వెబ్ సైట్ లో అమ్మకాలు సాగుతాయి. ఫోన్‌ల ప్రీ-బుకింగ్ జూలై 31న మధ్యాహ్నం 12:00 IST నుంచి ప్రారంభమవుతుంది , మొదటి విక్రయం ఆగస్టు 6న మధ్యాహ్నం 12:00 గంటలకు IST షెడ్యూల్ చేయబడింది.

లాంచింగ్ ఆఫర్లలో భాగంగా రియల్ మీ .. రూ. 3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లు, 12 నెలల నోకాస్ట్ EMI ఆప్షన్, Realme13 Pro  5G సిరీస్ లోని రెండు స్మార్ల్ ఫోన్లకు ఒక సంవత్సరం వారంటీని అందిస్తుంది. 

Realme Pro +, Realme Pro ధర, ఫీచర్లు 

Realme 13 Pro +రెండు కలర్లతో అందుబాటులో ఉంది. ఎమరాల్డ్ గ్రీన్ , మోనెట్ గోల్డ్ రంగులతో వస్తుంది. Realme 13 Pro + స్మార్ట్ ఫోన్ 8GB + 256GB  స్టోరేజ్ తో ధర రూ. 29,999 కి లభిస్తుంది. అదే 12GB + 256GB RAM స్టోరేజ్ వెర్షన్‌లకు రూ. 31వేల 999 వద్ద లభిస్తుంది. 12GB RAM + 512GB స్టోరేజ్ లో లభించే టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 33వేల 99-9 మాత్రమే. 

Realme 13 Pro ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్ ,మోనెట్ గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.23వేల999. కాగా..8GB +256GB స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ.25వేల 999..12GB + 512GB RAM రూ.28వేల 999.  

ALSO READ : టీఎస్‌‌హెచ్‌‌పీలో రూ.7,321 కోట్లు .. ఇన్వెస్ట్ చేసిన టాటా స్టీల్‌‌


Realme 13 Pro + ప్రత్యేకతలు 

Realme 13 Pro+ ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC , అడ్రినో GPUతో జత చేయబడింది. గరిష్టంగా 12GB RAM , 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఇది Android 14-ఆధారిత Realme UI 5.0 పై నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్  6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,412 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. కెమెరా సెటప్ కోసం Realme 13 Pro+ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా , 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు , వీడియో చాట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 

Realme 13 Pro+లో కనెక్టివిటీ కోసం Wi-Fi 6 , బ్లూటూత్ 5.2 ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్.. గేమింగ్ కోసం X-యాక్సిస్ లీనియర్ మోటార్, హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది. ఫోన్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ లో 5,200mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Realme 13 Pro స్పెసిఫికేషన్స్

Realme 13 Pro  స్మార్ట్ ఫోన్. Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌, 12GB RAM , 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లే..అదనంగా 4500 చదరపు mm టెంపర్డ్ స్ట్రీమ్ చాంబర్ , 9953 చదరపు mm గ్రాఫైట్ ప్లేస్ తో సహా తొమ్మిది-పొరల కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది.

Realme 13 Pro స్మార్ట్ ఫోన్ లో ..డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్ , 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు , వీడియో చాట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్, Realme 13 Pro+ రెండింటికీ కనెక్టివిటీ ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి. Realme 13 Pro వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. అదనంగా 45W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతుతో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది.