జగిత్యాలలో సోమవారం ఓ అద్భుతం.. గణపయ్య మెడపైకి చేరిన నాగు

జగిత్యాల టౌన్ లో జరిగిన వింత ఘటన అందర్ని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వినాయక ఉత్సవాలు జరుగుతుండగా ఓ పాము గణేష్ మండపంలోకి వచ్చింది. నేరుగా.. గణనాథుని మెడలో నాగేంద్రుడు అలంకరణగా చేరాడు. ఈ సన్నివేశాన్ని చూసిన వారు ఫొన్ లో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గణపయ్య మెడలో "నాగాభరణం"గా వచ్చి చేరిన నాగు పాము వీడియో చూసి భక్తులు షాక్ అవుతున్నారు. 

వాణి నగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ గణేష్ మండపంలో సెప్టెంబర్ 16న ఈ వింత జరిగింది. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఇది జరగడంతో శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడు (గణపతి) మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Also Read :- ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్