ఇండియాతో కలిసి పనిచేసేందుకు రెడీ:చైనా

చైనా దిగొచ్చింది. ఇండియాతో దోస్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలను సాధ్యమైన త్వరగా ట్రాక్ లో పెట్టేందుకు భారత్ తో కలిసి పనిచేయడానికి చైనా రెడీగా ఉందని ఆదేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అణ్వాయుధ పొరుగు దేశాల సమావేశంలో స్వయంగా ప్రకటించింది. 

బుధవారం ( డిసెంబర్185) న చైనాలోని బీజింగ్ లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చలకు ముందు ఈ ప్రటకన వెలువడింది. ఇది డిసెంబర్ 2019 తర్వాత చైనా నుంచి వచ్చిన తొలి పాజిటివ్ ప్రకటన ఇది. 

ALSO READ | Good News : క్యాన్సర్ కు వ్యాక్సిన్ వచ్చేసింది.. రష్యాలో ఫ్రీగా వేస్తున్నారు.. ఇండియాకు ఎప్పుడు..?

రెండు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒకరినొకరు గౌరవించుకోవడం, పరస్సర చర్యల ద్వారా చిత్తశుద్దితో విభేధాలను పరిష్కరించుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పునరుద్దరించేందుకు చైనా  భారత్ తో కలిసి చేయడానికి సిద్దంగా ఉంది.. త్వరలో ఆ దిశగా చర్యలు ఉంటాయని చైనా ప్రతినిధి ప్రకటించారు. 

భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన

తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి సైనిక ప్రతిష్టంభన మే 2020లో మొదలైంది. అదే సంవత్సరం జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ భారత్, చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. వాణిజ్యంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా ఆగిపోయాయి. అక్టోబరు 21న కుదిరిన ఒప్పందం ప్రకారం డెమ్‌చోక్ , దేప్‌సాంగ్ చివరి ఘర్షణ పాయింట్‌ల వద్ద సైనిక పాట్రోలింగ్ ను ఉపసంహరించుకున్నారు. 

బుధవారం నాటి ప్రత్యేక ప్రతినిధుల (SRs) సమావేశం కీలకమైనది. ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో నిర్వహించడం జరిగింది. 3,488 కి.మీ పొడవున్న భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి 2003లో ఏర్పడిన SRs యంత్రాంగం 22 సార్లు సమావేశమైంది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించనప్పటికీ రెండు దేశాల మధ్య పదేపదే తలెత్తున్న వివాదాలను పరిష్కరించేందుకు ఓ సాధనంగా ఉన్నాయి.