గ్రామస్తుల అనుమానం.. సమాధి నుండి తీసి చిన్నారి డెడ్ బాడీకి రీ పోస్ట్‎మార్టం

మానకొండూర్, వెలుగు: పసిపాప చనిపోగా కుటుంబ సభ్యులు సొంతూరికి తీసుకొచ్చి పూడ్చిపెట్టగా గ్రామస్తులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన చందుపట్ల హర్షవర్ధన్ రెడ్డి భార్య నెల కిందట డెలివరీ అయింది. పాప నెలలు నిండకుండానే పుట్టగా అనార్యోగ సమస్య ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. పాప చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా.. అదేరోజు రాత్రి గ్రామానికి  తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. గురువారం భూమి యజమాని, కొందరు గ్రామస్తులు అనుమానించి  కారోబార్‎కు చెప్పారు. అతను మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీఐ సదన్ కుమార్, తహశీల్దార్ రాజేశ్వరి ఘటనా స్థలానికి వెళ్లారు. వైద్య సిబ్బందిని పిలిపించి పసిపాప డెడ్ బాడీని బయటకు తీయించి పోస్టుమార్టం చేశాక.. తిరిగి పూడ్చిపెట్టారు. 

========================================================================