ప్రభుత్వ భూములు అక్రమిస్తే చర్యలు : ఆర్డీవో శ్రీనివాసరావు

  • మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు 

మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడ ఆర్డీవో ఆఫీస్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెవెన్యూ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల జారీలో దళారులు ప్రమేయం ఉంటే సహించబోమన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మూడు రోజుల్లోనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.

అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మాత్రమే చెల్లించాలన్నారు.  ఎక్కువ డబ్బులు తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. సమావేశంలో తహసీల్దార్లు హరిబాబు, జవహర్ లాల్, ఏవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 


RDO Srinivasa Rao warned that strict action will be taken if government lands and ponds are encroached upon

RDO Srinivasa Rao, warned, strict action, government lands, ponds, encroached upon,  latest news, telugu news, telangana news, nalgonda district, exclusive news, telugu update, v6 news