జగిత్యాల జిల్లా హాస్పిటళ్లలో తనిఖీలు

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లను ఆర్డీవో మధుసూదన్‌‌, డిప్యూటీ డీఎంహెచ్‌‌వో శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. పలు హాస్పిటళ్లలో రికార్డులు పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌‌వో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ హాస్పిటళ్లలో సర్జికల్నా

న్ సర్జికల్, ఓపీ, ఐపీ, ల్యాబ్‌‌కు సంబందించిన అన్ని ధరల పట్టికలు ఏర్పాటు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చామన్నారు.