బెంగళూరు సిటీ నడిబొడ్డున.. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సాక్షిగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది ఆర్బీసీ యాజమాన్యం. చనిపోయిన ఒక్కొక్కరికి.. వాళ్ల వాళ్ల కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం ప్రకటించింది యాజమాన్యం. 11 మందికి.. 10 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నట్లు వెల్లడించింది.
చనిపోయిన వారికే కాకుండా గాయపడిన వాళ్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది ఆర్సీబీ యాజమాన్యం. గాయపడిన వారిని ఆదుకోవటానికి సహాయ నిధి ఏర్పాటు చేస్తామని.. ఈ నిధి నుంచి వాళ్లకు సాయం చేస్తామని వెల్లడించింది. గాయపడిన అభిమానులను ఆదుకోవటానికి ఆర్బీసీ కేర్ పేరుతో ఓ ఫండ్ ఏర్పాటు చేస్తామని.. గాయపడిన అభిమానులు కోలుకునే వరకు వాళ్లకు సాయం చేస్తామని వెల్లడించింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అభిమానులకు వైద్య సాయానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది ఆర్సీబీ.
Also Read:-రూ.కోటి ఇస్తా నా కొడుకును ప్రాణాలతో తిరిగి తెస్తారా? పానీపూరీవాలా సీరియస్
మా అభిమానులు మాకు గుండెకాయ లాంటి వారు.. అలాంటి అభిమానులు దుఖంలో ఉంటే.. ఆదుకోవటానికి ఐక్యంగా ముందుకొస్తామంటూ తన ఔదార్యాన్ని చాటుకున్నది ఆర్సీబీ యాజమాన్యం. బెంగళూరులో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.. RCB కుటుంబానికి చాలా తీవ్ర మనోవేదనకు గురి చేసింది.. బాధను కలిగించిందంటూ నోట్ రిలీజ్ చేసింది ఆర్సీబీ మేనేజ్ మెంట్.
???????? ?????????: ????? ??????????? ?????????
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 5, 2025
The unfortunate incident in Bengaluru yesterday has caused a lot of anguish and pain to the RCB family. As a mark of respect and a gesture of solidarity, RCB has announced a financial… pic.twitter.com/C50WID1FEI
