31 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి శపథం... అయోధ్యలో రామ మందిరం కట్టాకే పెళ్లి చేసుకుంటా

అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు పెళ్లి చేసుకోనని 30 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి శపథం చేశాడు. తర్వాత సాధువుగా మారి.. 3 దశాబ్ధాల నుంచి రాముడి సేవలోనే తరిస్తున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 56 ఏళ్లు. ఇన్నేళ్లూ రాముడిని పూజించినందుకు అతడికి కలలో ఊహించని అదృష్టం వరించింది. అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ట రోజు రావాలని ఆయనకు రామమందిర ట్రస్టు ఆహ్వానం పంపించింది.

 అయోధ్యలో రామమందిరం కట్టేదాక పెళ్లి చేసుకోబోనని 31 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేసి సాధువుగా మారిన ఓ వ్యక్తికి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్ఠకు రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆయనకు ఆహ్వానం పంపింది. అది కూడా పూజారిగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆహ్వానం అందింది. 

మధ్యప్రదేశ్ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా.. అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మితమయ్యే వరకు వివాహం చేసుకోనని 1992లో శపథం చేశారు. అప్పుడు ఆయన వయసు 25 ఏళ్లు. ఆ తర్వాత సాధువుగా మారి తన పేరును భోజ్‌పలి బాబాగా మార్చుకున్నారు. 3 దశాబ్దాలుగా రాముని సేవలో కాలం వెల్లదీస్తున్న తనకు ప్రస్తుతం 56 ఏళ్లని భోజ్‌బలి బాబా చెప్పారు. ఆర్‌ఎస్ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌లో రవీంద్ర ఒకప్పుడు క్రియాశీలకంగా ఉండేవారు.

 అయోధ్య రామాలయం కర సేవకుల్లో రవీంద్ర ఒకరు. న్యాయవాదిగా పనిచేశారు. అయోధ్య ట్రస్ట్ ఆహ్వానంపై చాలా సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఇది భగవంతుని ఆశీర్వాదంగా చూస్తున్నానని చెప్పారు. ఈ మహత్ కార్యంలో తాను భాగస్వామిని అవుతానని ఊహించలేదన్నారు. తనకు ప్రస్తుతం పెళ్లి వయసు దాటిందనీ మిగిలిన జీవితం రాముడికే అంకితమిస్తానని భోజ్‌పలి తెలిపారు. 53 ఏళ్ల భోజ్‌పాలి బాబా ఇప్పుడు తన జీవితం నర్మదానది కోసం, మాతృ దేశం భారతమాత సేవలో గడపాలనుకుంటున్నట్లు చెప్పారు.