నీ కొడుకులకు సంస్కారం నేర్పించుకో : ఏనుగు రవీందర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి తన కొడుకులకు సంస్కారం నేర్పించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్​రవీందర్ రెడ్డి హితవు పలికారు. శనివారం బాన్సువాడ మండలం సోమేశ్వర్ లో పర్యటించిన ఆయన, విలేకరులతో మాట్లాడారు. పోచారం సమక్షంలోనే ఆయన కొడుకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్నారు. సోమేశ్వర్ లో పోచారం కొడుకు క్రషర్ నడుపుతున్నాడని, ఇక్కడ ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేదని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్​ఇండ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని విమర్శించారు.​ అంతకుముందు మైనార్టీ గురుకుల స్కూల్​ను సందర్శించి స్టూడెంట్స్​సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు మాసాని శ్రీనివాస్ రెడ్డి, నార్ల రత్న కుమార్, ఎలమంచిలి శ్రీనివాస్, మాసాని శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.