టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవి 

  •     కొత్త కమిటీ ఎన్నిక   

నల్గొండ అర్బన్, వెలుగు : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా, వైజ్ఞానిక మహాసభలు సోమవారం ముగిశాయి. మొదటిరోజు ఉపాధ్యాయుల మహా ప్రదర్శన, ప్రారంభ సభ, విద్యాసదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో రోజు ప్రతినిధుల సభ నిర్వహించారు. మూడో రోజు సోమవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికపై చర్చలు జరిగాయి. ప్రతినిధుల సభలో విద్యా సమస్యలపై 8 తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా చావా రవి, ప్రధాన కార్యదర్శిగా ఏ.వెంకట్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కె.జంగయ్య, సీహెచ్ దుర్గ భవాని, కోశాధికారిగా టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులుగా సీహెచ్ రాములు, కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్ రెడ్డి, వి.శాంతికుమారి, జి.సమ్మరావు, డి.సత్యానంద్, జి.నాగమణి, బి.రాజు, కె.రంజిత్ కుమార్, ఎస్.రవిప్రసాద్ గౌడ్, ఎస్.మల్లారెడ్డి, కె.రవికమార్, జి.శ్రీధర్, ఏ.సింహాచలం

వై.జ్ఞానమంజరి, ఎం.వెంకటప్ప, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా జాకటి యాకయ్య, వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రిక ప్రధాన సంపదకులుగా పాపన్నగారి మాణిక్ రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి చైర్మన్ గా ఎం.రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చెలివేరు అనిల్ కుమార్, కోశాధికారిగా ఎడ్ల సైదులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు సంఘం నూతన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.