వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ రేషన్ డీలర్ల నిరసన

సిరిసిల్ల టౌన్, వెలుగు : తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు గురువారం సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమంగా భర్తీ చేసిన రేషన్ షాపులను తమకే కేటాయించి  న్యాయం చేయాలని 30 మంది రేషన్ డీలర్లు డిమాండ్​చేశారు. పోలీసుల జోక్యంతో వారు కిందికి దిగివచ్చారు. అనంతరం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వినతిపత్రం  అందజేశారు.