పుష్ప 2: ది రూల్ అంతకుమించి ఉంటుందంటున్న రష్మిక..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమాలో కన్నడ హీరోయిన్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా పుష్ప 2 డిసెంబర్ 05న వరల్డ్ వైడ్  దాదాపుగా  11500  థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇందులో మనదేశంలోనే ప్యాన్ ఇండియా భాషలలో దాదాపుగా 6500 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. దీంతో పుష్ప 2 రిలీజ్ మొదటి రోజే రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో షూటింగ్ డబ్బింగ్ పనులు ఫాస్ట్ గా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో రష్మిక మందాన డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ఇందులోభాగంగా ఫన్ టైమ్ పూర్తయ్యిందని,  ఇక సీరియస్ గా పని చేయాల్సిన సమయం ఇది అని తెలిపింది. అలాగే పుష్ప 2  ఫస్టాఫ్ కి మించి ఉంటుందని, కచ్చితంగా మీకు నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఈ చిత్రాన్ని మీకు చూపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని, కానీ మరోవైపు ఘాట్ పూర్తి అవుతున్నందుకు బాధగా ఉందని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ చేసింది.