రామజన్మ స్థలం : కొరియాతో సంబంధం!

దక్షిణ కొరియాకు చెందిన కరక్ వంశస్తులు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారట! రాణి సూరిరత్న చిన్న వయసులో అయోధ్య నుంచి కొరియాకు పడవలో చేరుకుంది. ఆమెకు16 ఏండ్ల వయసులో పెండ్లి అయినట్లు కొరియన్లు నమ్ముతారు! చైనా గ్రంథాల ప్రకారం... అయోధ్యను పరిపాలించే రాజుకి కలలో తన16 ఏండ్ల కూతురిని దక్షిణ కొరియాకు చెందిన కిమ్ సూరోకి ఇచ్చి పెండ్లి చేయాలనే కల వచ్చినట్లు చెప్తారు. 

ఆ జంటకు పది మంది పిల్లలు పుట్టారు. వాళ్లు150 ఏండ్లు బతికారని ఆ గ్రంథాల్లో ఉందట. 2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్​ కిల్, ‘‘కొరియా ప్రాచీన చరిత్ర గ్రంథాల్లో అయోధ్య గురించి ఉంది. అయోధ్య యువరాణి కొరియన్ రాజును పెండ్లి చేసుకున్నట్లు అందులో ఉంది. రాజు కిమ్​ సురో సమాధి పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు కూడా బయటపడ్డాయ”ని చెప్పాడు.