దేవి నవరాత్రుల్లో 1008 శ్రీచక్రాల ప్రతిష్ట

యాదాద్రి, వెలుగు:  దేవి నవరాత్రుల్లో 1008 శ్రీచక్రాలను ప్రతిష్టిస్తామని రమణానంద మహర్షి తెలిపారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వర క్షేత్రంలో ఆయన  మాట్లాడారు. ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆశ్రమంలో అమ్మ అనుగ్రహంతో 1008 ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేవి నవరాత్రులను పురస్కరించుకొని శ్రీచక్ర మహాలయం, మహమేరు, శ్రీ కామేశ్వరి, కామేశ్వర, భూప్రస్తార, కేలాస ప్రస్తారం, మహమేరు ప్రస్తార శ్రీచక్రాలయాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 

ఆశ్రమంలో ఇప్పటివరకూ 1800 శివలింగాలు, 250 దేవతామూర్తులను ప్రతిష్టించామని ఆయన తెలిపారు. దేవి నవరాత్రులు సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సీతక్క, ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి ని ఆహ్వానించనట్టు ఆయన  తెలిపారు.