గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో మూసివేసిన బి- థర్మల్ప్లాంట్స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ విద్యుత్‌ప్లాంట్‌ను సింగరేణి, టీఎస్ జెన్కో సంస్థ జాయింట్‌వెంచర్‌లో నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు సార్లు భేటీ అయిన రెండు సంస్థల ఉన్నతాధికారులు శనివారం మరోసారి హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. రామగుండంలో 1971లో 62.5 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్కోకు చెందిన బి-థర్మల్‌పవర్ ప్లాంట్‌ను సర్కార్ 2024 జూన్4న మూసివేసింది. దాని స్థానంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్‌ను నెలకొల్పాలనే డిమాండ్పెరిగిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌కూడా పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత తెలిపింది.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి ప్రభుత్వంమొగ్గు చూపినప్పటికీ జెన్కో సంస్థకు చెందిన 26 ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో జాయింట్‌వెంచర్‌లో ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్‌లో ఎవరికెంత వాటా ఉండాలనే అంశం మీటింగ్‌లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. 800 మెగావాట్ల విద్యుత్ప్లాంట్నిర్మాణానికి అవసరమైన 550 ఎకరాల భూమితో పాటు సింగరేణి నుంచి బొగ్గు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీరు అందుబాటులో ఉన్నాయి.