ఖనిలో ఉత్సాహంగా అలయ్-బలయ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: అలయ్‌‌‌‌‌‌‌‌–-బలయ్​ వ్యక్తుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుందని రామగుండం మేయర్​ బంగి అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. సామాజిక ఐక్య వేదిక కన్వీనర్​ క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని కల్యాణ్​నగర్​లో బుధవారం అలయ్‌‌‌‌‌‌‌‌–బలయ్​ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

 ఈ సందర్భంగా మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన కందుల సంధ్యారాణి, పోచం, మేరుగు హన్మంత్‌‌‌‌‌‌‌‌గౌడ్​, డాక్టర్​ రాజేందర్, బొంకూరి మధు, నటరాజశేఖర్​, కొంకటి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌​, మైస రాజేశ్​, దుబాసి బొందయ్య, ఏకు శ్రీనివాస్​, మధునయ్య, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.