వాహనాల వేగానికి స్పీడ్‌‌‌‌‌‌‌‌గన్స్‌‌‌‌‌‌‌‌ తో కళ్లెం : రామగుండం సీపీ శ్రీనివాస్​ వెల్లడి

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులపై నిర్ణీత వేగానికి మించి వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు.  సీపీ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో మూడు స్పీడ్ గన్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.  2024 లో మొత్తం 7,047 కేసులు నమోదు చేసి, రూ.72,77,445 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు.  

రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,460 కేసులు,  రూ.25,46,100 జరిమానా, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  1,505 కేసులు, రూ.15,57,675 జరిమానా, మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,082 కేసులు,  రూ.31,73,670 జరిమానా విధించినట్టు పేర్కొన్నారు.  ప్రమాదాలు జరిగే 53 ప్రాంతాలను బ్లాక్‌‌‌‌‌‌‌‌స్పాట్లుగా గుర్తించామని తెలిపారు.