యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తేజస్విని

గోదావరిఖని, వెలుగు: యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామగుండం 11వ డివిజన్​ కార్పొరేటర్​ పెద్దెల్లి తేజస్విని ఎన్నికయ్యారు. అలాగే యూత్​ కాంగ్రెస్​ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బొంకూరి అవినాష్​, నియోజకవర్గ అధ్యక్షునిగా నజీముద్దీన్​, కార్పొరేషన్​ ఏరియా అధ్యక్షునిగా కౌటం సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​, అంతర్గాం, పాలకుర్తి మండలాల అధ్యక్షులుగా డి.శ్యామ్​సుందర్​, వాసుదేవరావు, యూత్​ కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ముచ్చకుర్తి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్లాల జ్యోతి, సాయికిరణ్​, నియోకవర్గ యూత్​ ఉపాధ్యక్షునిగా సాయి ఎన్నికయ్యారు. 

సైదాపూర్, వెలుగు:  యూత్ కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షుడిగా వేముల సాయికుమార్ ఎన్నికయ్యాడు, ఆన్​లైన్​ ఓటింగ్ ద్వారా సాయికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1058 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థిపై 93 ఓట్ల తేడాతో  గెలుపొందారు.

సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్

సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బూర అశోక్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ లో  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్​ఎన్నికల్లో అశోక్ 408 ఓట్లతో విజయం సాధించారు.