రామగుండంలో మార్పు మొదలైంది : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

-గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మార్పు మొదలైందని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ తెలిపారు. కార్పొరేషన్​ పరిధిలోని 38వ డివిజన్​లో రూ.3.76  కోట్ల టీయూఎఫ్​ఐడీసీ నిధులతో పైలట్​ ప్రాజెక్ట్​గా నిర్మిస్తున్న 900 మీటర్ల ఓపెన్​ డ్రైనేజీ మేజర్​ నాలా పనులను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, ఓపెన్​ డ్రైనేజీ నాలాలు లేక చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారన్నారు.  గడిచిన 25 ఏళ్ళలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ప్రజాప్రతినిధులు చేయలేని పనులు నేడు కాంగ్రెస్​ పాలనలో జరుగుతున్నాయని తెలిపారు.