ఇట్స్ ఏ బిగ్ డే: రామ్‌ చ‌ర‌ణ్ RC16పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన

'ఇట్స్ ఏ బిగ్ డే'.... ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.. చాముండేశ్వరి మాత, మైసూర్ ఆశీస్సులతో RC 16 ప్రారంభమైంది మీ అంద‌రి అశీర్వాదం ఉండాలి` అని ఆయ‌న డైరెక్టర్ బుచ్చిబాబు సాన ట్వీట్ చేసారు. వివరాల్లోకి వెళితే.. 

గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌తోన్న కొత్త సినిమా (RC16). స్పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రిస్ఠిక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ కి సిద్ధమైంది. ఇన్నాళ్లు RC 16 షూటింగ్ ఎప్పుడెప్పుడు షురూ అవుతోందని వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్కి డైరెక్ట‌ర్ బుచ్చిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇది ఎంతో ముఖ్య‌మైన రోజు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న రోజు అంటూ RC 16 మైసూర్ లో మొదలెట్టేశారు. 

లేటెస్ట్ విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా మైసూరుకు చేరుకున్నట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ చరణ్ సీన్ తోనే స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. ఇందులో RC 16 కీల‌క పాత్ర‌ధారులంతా ఈ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ నెంబర్ వన్ యాక్టర్ జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు.

Also Read:-'గేమ్ ఛేంజ‌ర్' థ‌ర్డ్ సింగిల్ అప్డేట్..

RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.