భారతదేశంలోని విభిన్న ప్రాంతాల వారు పలు ఆచారాలను పాటిస్తారు. ఇక శ్రావణ పౌర్ణమి విషయానికొస్తే రాఖీ పండుగ.. రక్షా బంధన్ పండుగ.. సోదరుల చేతికి.. సోదరీమణులు అందమైన రాఖీ కడతారు. కాని ఉత్తరప్రదేశ్ లోని హార్పుల్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఉండే దాదాపు 60 గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరూ కూడా రాఖీ కట్టుకోరట. ఎందుకంటే రాఖీ పండుగను గత నాలుగైదు దశాబ్దాల నుండి అందరి కంటే భిన్నంగా జరుపుకుంటున్నారు. అందరూ తమ సోదరులకు రాఖీ కడితే.. వీరు మాత్రం అందుకు బదులుగా కలప కర్రలకు రాఖీ కడతారు.
ఉత్తరప్రదేశ్ లోని హార్పూర్ జిల్లా (Hapur district)లోని దాదాపు 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరు. జరుపుకోరు అంటూ పూర్తిగా జరుపుకోరని కాదు. సాధారణంగా సోదరుల చేతులకు వారి అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఆడవాళ్లు మాత్రం కర్రలకు రాఖీలు కడతారు. నాలుగైదు వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీంతో ఈ 60 గ్రామాల్లో మగవారి చేతులకు రాఖీలు కనిపించవు గానీ కర్రలకు మాత్రం రాఖీలు కనిపిస్తాయి.
ఈ 60 గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాల్ని ఈనాటికి పాటిస్తున్నారు. క్రీస్తు శకం 1576లో హల్దీఘాటీ యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లే సైనికులకు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు భార్య, లేదా సోదరి, లేదా తల్లి ఎవరోకరు రక్షా బంధన్ కట్టి వీర తిలకం దిద్ది పంపించటం జరుగుతుంటుంది. గతంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో ఇటువంటి ఘట్టం జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కానీ హల్దీఘాటీ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మహిళలు ఎవరు రక్షా బంధన్ కట్టలేదు. సైనికుల కర్రలకు రక్షా బంధన్ కట్టారు.
అప్పట్లో చేతులకు రాఖీలు కట్టే సంప్రదాయం అక్కడ లేదట. అందుకే ఇప్పటికే అక్కడి మహిళలు మగవారి చేతులకు రాఖీలు కట్టరు. గతంలో వలెనే కర్రలకు రాఖీలు కడతారు. వందల ఏళ్లుగా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రాఖీ పూర్ణిమ రోజున కర్రలకే రాఖీలు కడతారు. దీన్ని స్థానికంగా ఛాడీ పూజ (Chhadi Puja) అని పిలుస్తారు. అంతేకాదు ఆ రోజున ఆ పరిధిలోని గ్రామాల్లో జాతరలు జరుపుకుంటారు.. . .