Online Rakhi: అన్నా.. తమ్ముడు.. విదేశాల్లో ఉన్నారా... అయితే ఇలా రాఖీ పంపండి..

రాఖి పున్నమి వచ్చిందంటే తోబుట్టువుల ఆనందానికి అవధులే ఉండవు. పండుగకు వారం ముందు నుంచే మా వాడికి మంచి రాఖీ కట్టాలి.. అందుకు నచ్చిన రాఖీలు తీసుకోవాలి కదా.. అలాంటివి  ఏ దుకాణంలో మంచిగా ఉన్నాయా  అని ఆలోచిస్తుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడంతా ఆన్​ లైన్ రాఖీలే. ఆన్​ లైన్ లో  చూసి నచ్చిన రాఖీ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ యుగం.. తీరని పని.. అన్నా చెల్లెళ్లు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు. అయినా వచ్చి రాఖీ కడతారు. మరి రాలేకపోతే.... అలాంటివాళ్లకు మేమున్నాం. అంటున్నాయి కొన్ని ఆన్​ లైన్ మార్కెట్ సైట్లు.

 మీ అన్నదమ్ములు ఏ దేశంలో ఉన్నా, ఏ పట్నంలో ఉన్నా మాకు చెప్పండి. వీలైనంత తొందరగా రాఖీ పంపుతం అంటున్నాయి  రాఖీ ఆన్​లైన్​ సెల్లింగ వెబ్​సైట్లు. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల  అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ కంప్యూటర్ యుగంలో మనుషుల మధ్య దూరం పెరిగినా ప్రేమ తగ్గలేదు. అందుకే అన్న, తమ్ముడు ఎక్కడున్నా వెళ్లి వాళ్ల క్షేమం కోరి అక్కా చెల్లి రాఖీ కడతారు. అయితే... పనుల వల్ల ప్రత్యక్షంగా కలిసి రాఖీ కట్టలేనివాళ్ల కోసం ఆన్లైన్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని వెబ్​సైట్లు ఆన్​ లైన్​ లో రాఖీ సెలెక్ట్ చేసుకుని, కొని, మనకు కావాల్సిన అడ్రస్ కు పంపే అవకాశం కల్పిస్తున్నాయి. ఒక్క క్లిక్​ తో  పంపాల్సిన అడ్రస్​ కు రాఖీ వెళ్లిపోతుంది. 

జిల్లా.. రాష్ట్రం, దేశం విదేశాల్లో ఎక్కడికైనా ఇలా పంపొచ్చు. అందుకే చాలామంది ఫారిన్ కంట్రీస్​ లో ఉన్న  అన్నాదమ్ముళ్లకు ఆన్​ లైన్​లోనే  రాఖీలు పంపుతున్నారు. రాఖీలు మాత్రమే కాదు వాటితోపాటు స్వీట్లు పంపొచ్చు.  ఇక  రాఖీ అందుకున్న బ్రదర్​ .. సిస్టర్​ కు రిటన్​ గిఫ్ట్​ కూడా ఆన్​ లైన్​ లోనే పంపొచ్చు. 

దూరం దగ్గరవుతోంది

సోషల్ మీడియా వాడడం పెరిగిన తర్వాత అనుబంధాలు తగ్గిపోయాయి. పొద్దున్నే లేవగానే పక్క వీధిలో ఉండే ఫ్రెండ్ కు కూడా ఫేస్ బుక్ నే గుడ్ మార్నింగ్ చెప్తాం. లేదంటే వాట్సాప్​ లో  స్టేటస్ పెట్టి షేర్ చేసుకుంటాం. పక్కపక్కనే ఉన్నా ఫోన్ లోనే మాట్లాడుకుంటాం. అందరూ కలిసి గడపడం చాలా తక్కువ.
ఇంటర్నెట్​ మనుషులను అంతగా దూరం చేస్తోంది. కానీ.. రాఖీ పండుగ విషయంలో మాత్రం మారమవుతున్న బందాలను దగ్గర.. చేస్తోంది.

మార్కెట్ కు వెళ్లాల్సిన పనేలేదు

-రాఖీ పండుగ వస్తుందంటే చాలు మార్కెట్ అంతా తిరిగి జల్లెడ పట్టి రాఖీలు కొనేవాళ్లు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ఆన్​ లైన్​ లో  వేల రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఇలా స్వైప్ చేసి, అలా క్లిక్ చేస్తే చాలు డోర్​ డెలివరీ చేస్తారు. అంతేకాకుండాకొన్ని సైట్లు  రాఖీ పండగకు స్పెషల్ ఆఫర్లు కూడా పెడుతున్నాయి.

కోట్లలో వ్యాపారం

మనదేశంలో వాలెంటైన్స్ డే తర్వాత ఎక్కువ బిజినెస్ జరిగేది రాఖీ పండుగ పైనే అంటున్నారు  మార్కెట్​ ఎక్స్ పర్ట్స్. రక్షా బంధన్ పేరిట ఆన్ లైన్ సైట్లు రూ. 200 కోట్ల పైగానే వ్యాపారం చేయొచ్చని అంచనా.  హైటెక్​ యుగంలో షాప్ వెంట తిరిగి తమకు నచ్చిన రాఖీలను ఎంపిక చేసుకునే టైం ఎవరికీ ఉండడం లేదు.  అందుకే అన్ని రకాల రాఖీలు ఆన్లైన్లోలోనే అమ్ముతున్నాయి కొన్ని సంస్థలు అలాంటి వాటిలో కొన్ని పాపులర్ వెబ్ సైట్లు:- 
www.redeff.com
www.amzzon.com
www.sendarakhi2online.com
www.rakhisale.com